బొలెరో-ట్రక్కు ఢీ ఘటనలో మరణించిన కుటుంబాలకు ఆర్థిక సాయం- మోదీ

0
108

తెలంగాణ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా..తాజాగా  ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌నగర్ వద్ద జరిగిన ప్రమాదంలో భారీ ప్రాణనష్టం చవిచూడవలసి వస్తుంది.

వేగంగా వస్తున్న బొలెరో చూసుకోకుండా ఆగివున్న ఉన్న ట్రక్కును ఒక్కసారిగా ఢీ కొనడంతో ఎనమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా..మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టి గాయపడిన పడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనలో  బొలెరో వాహనం పూర్తిగా ధ్వంసం కాగ..ఈ ప్రమాదానికి డ్రైవర్ నిద్ర, అతివేగం కారణమని పోలీసులు నిర్దారించారు. దాంతో ఈ ఘటనపై స్పందించిన నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ఎక్స్​గ్రేషియా ప్రకటించారు. దాంతో పాటు కుటుంబసభ్యులను కూడా పరామర్శించాడు.