ఫ్లాష్..ఫ్లాష్- నారా లోకేశ్ పై హత్యాయత్నం కేసు

Flash..Flash- Attempted murder case registered against Nara Lokesh

0
74

టీడీపీ నేత నారా లోకేశ్ పై పోలీసు కేసు నమోదైంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చిన సీఐ నాయక్ పై దాడి చేశారంటూ మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో లోకేశ్ ను ఏ1గా, అశోక్ బాబును ఏ2గా, ఆలపాటి రాజాను ఏ3గా, తెనాలి శ్రవణ్ ను ఏ4గా, పోతినేని శ్రీనివాసరావును ఏ5గా పేర్కొన్నారు.

వీరితో పాటు మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. వీరందరిపై హత్యాయత్నం సహా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన తర్వాత అక్కడకు సీఐ నాయక్ వచ్చారని. ఈ సందర్భంగా నారా లోకేశ్ సహా పలువురు దాడి చేసినట్టు ఆరోపణలు వచ్చాయని, ఈ నేపథ్యంలో హత్యాయత్నం కేసులు నమోదు చేశామని చెప్పారు.