ఫ్లాష్- డ్రగ్స్ కేసు..ఆర్యన్ ఖాన్ కు మరోసారి చుక్కెదురు

Spotted once again to Aryan Khan

0
34

ముంబయిలోని క్రూయిజ్​ నౌక డ్రగ్స్‌ కేసులో ఇటీవల అరెస్టయిన బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. బెయిల్ కోసం అతడు చేసుకున్న దరఖాస్తును తిరస్కరించింది ముంబయి ప్రత్యేక న్యాయస్థానం.

అక్టోబర్ 14న ఆర్యన్‌, అర్బాజ్, మూన్‌మూన్‌ ధామేచాల బెయిల్‌ పిటిషన్‌పై ఎన్​సీబీ, డిఫెన్స్‌ న్యాయవాదుల మధ్య కోర్టులో సుదీర్ఘవాదనలు కొనసాగాయి. ఆర్యన్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని ఎన్​సీబీ వాదించింది. అనంతరం బెయిల్‌పై తీర్పును జడ్జి వీవీ పాటిల్‌ ఈ నెల 20కు వాయిదా వేశారు. బుధవారం మరోసారి ఈ విషయంపై విచారణ చేపట్టిన కోర్టు వారికి బెయిల్​ను నిరాకరించింది.