మాజీ మిస్​ తెలంగాణ ఆత్మహత్యాయత్నం..లైవ్ వీడియో పోస్ట్

Former Miss Telangana suicide attempt..what actually happened?

0
90

మాజీ మిస్​ తెలంగాణ ఆత్మహత్యకు యత్నించింది. హైదరాబాద్​లోని నారాయణగూడ పరిధిలో నివాసముంటున్న మాజీ మిస్​ తెలంగాణ హసిని.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఊరేసుకుని బలవన్మరణానికి తెెగబడింది. అయితే.. ఇంతలోనే నారాయణగూడ పోలీసులు వచ్చి ఆ యువతిని రక్షించారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం హాసిని క్షేమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు.

2018లో మిస్ తెలంగాణగా ఎంపికైన యువతి హాసిని. తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సోషల్​మీడియాలో పోస్ట్​ చేసింది. ఈ పోస్ట్​ని చూసిన హాసిని స్నేహితులు క్షణం కూడా ఆలస్యం చేయకుండా డయల్​-100 కు ఫోన్​ చేసి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు.. హుటాహుటిన హిమాయత్​నగర్ రోడ్​నంబర్-6 లో ఉన్న తన ఫ్లాట్​కి చేరుకున్నారు.

అప్పటికే ఉరికి వేలాడుతోన్న యువతిని ప్రాణాలతో కాపాడారు. హైదర్​గూడాలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు హాసిని క్షేమంగా ఉన్నట్టు వెల్లడించారు. స్నేహితులు ఆ పోస్టు చూడటం పోలీసులకు సమాచారం అందించటం దానికి పోలీసులు కూడా సకాలంలో స్పందించడం  వల్ల హాసిని ప్రాణాలతో బయటపడింది.

హాసిని కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటోందని సన్నిహితులు చెప్పుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకనే.. యువతి ఆత్మహత్యకు యత్నించినట్టు అంచనా వేస్తున్నారు. ఇదొక వైపైతే.. మరోవైపు.. హాసిని ఇటీవలే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఓ యువకుడు తనను శారీరకంగా వేధించాడని కాంప్లైంట్​ ఇచ్చింది. మరి తాను ఆత్మహత్యకు యత్నించడానికి ఈ రెండింట్లో ఏది అసలైన కారణమనేది పోలీసులు తేల్చాల్సి ఉంది.