మీ రేషన్‌ కార్డుకు ఆధార్‌ నెంబర్‌ లింక్‌ లేదా? అయితే ఇలా ఈజీగా చేయండి..

Linked Aadhaar number to your ration card? Make it easy ..

-

దేశవ్యాప్తంగా ‘వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్’ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ప్రజలు అనేక ప్రయోజనాలు పొందవచ్చు. తక్కువ ధరకే మంచి ఆహారాన్ని పొందవచ్చు.

- Advertisement -

అయితే రేషన్ కార్డును ఆధార్‌కి లింక్ చేయడం తప్పనిసరి. ఇలా లింక్‌ చేయడం వల్ల మరిన్ని బెనిఫిట్‌ పొందవచ్చు. దేశంలోని ఏ రాష్ట్రంలోని ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అయినా రేషన్ పొందవచ్చు. రేషన్‌ కార్డుకు ఆధార్‌ లింక్‌ చేసుకోవాలని అధికారులు పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. లబ్దిదారులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో రేషన్ కార్డును ఆధార్‌కు లింక్ చేయవచ్చు.

ఆధార్‌కు రేషన్‌ కార్డును లింక్ చేయడానికి అధికారిక వెబ్‌సైట్ uidai.gov.in ఓపెన్ చేయాలి. వెబ్ పేజీలో కనిపించే ‘స్టార్ట్ నౌ’ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే.. కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. ఇందులో అడిగే చిరునామా, రాష్ట్రం, ఫోన్ నంబర్ తదితర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ‘రేషన్ కార్డ్ బెనిఫిట్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత మీ ఆధార్ కార్డ్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి. అనంతరం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. వెబ్ పేజీలో ఓటీపీని నమోదు చేసిన తర్వాత..ఈ ప్రక్రియ పూర్తయినట్లు మీ మొబైల్‌ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది. అనంతరం ఆధార్ ధృవీకరణ పూర్తయ్యి రేషన్ కార్డుతో లింక్ అవుతుంది.

ఆఫ్‌లైన్ ద్వారా కూడా ఆధార్ నెంబర్, రేషన్ నెంబర్ లింక్ చేసుకునే సదుపాయం ఉంది. రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలతో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫోటోను రేషన్ కార్డు కేంద్రంలో అందించడం ద్వారా కూడా ఈ పని చేసుకోవచ్చు. లబ్ధిదారులు ఆఫ్‌లైన్ విధానంలో ఆధార్‌కు రేషన్ కార్డును అనుసంధానం చేయవచ్చు. ఇక రేషన్ కార్డు కేంద్రంలో ఆధార్ డేటా బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ కూడా చేయవచ్చు. దీంతో సంబంధిత అధికారి విభాగానికి ఈ దరఖాస్తును పంపిస్తారు. అధికారులు అన్ని వివరాలను పరిశీలించిన తరువాత.. ఆధార్‌కు రేషన్ కార్డు అనుసంధానం పూర్తయినట్లు లబ్ధిదారులకు మెసేజ్ వస్తుంది.

ఎస్‌ఎంఎస్‌ SMS) ద్వారా కూడా రేషన్ కార్డును ఆధార్‌కు లింక్ చేయవచ్చు. ఇందుకు లబ్ధిదారుడు UID SEED అని టైప్ చేసి స్టేట్ షార్ట్ కోర్డ్ టైప్ చేసి ప్రోగ్రామ్ కోడ్ టైప్ చేసి స్కీమ్ ఐడీ టైప్ చేసి ఆధార్ నెంబర్ టైప్ చేసి 51969 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. ఉదాహరణకు: UID SEED MH POSC 9876543 123478789012 అని టైప్ చేయాలి. ఈ విధానాల వల్ల రేషన్‌ కార్డుకు ఆధార్‌ కార్డును లింక్‌ చేసుకోవచ్చు.

ఈ తేలికైన పద్దతుల ద్వారా మీ రేషన్ కార్డును ఆధార్ కు లింక్ చేసుకోండి మరిన్ని ప్రయోజనాలను పొందండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...