ఫ్లాష్..ఫ్లాష్..ఫ్లాష్- మళ్లీ ఆత్మహత్యకు ప్రయత్నించిన మాజీ మిస్ తెలంగాణ

Former Miss Telangana who tried to commit suicide again

0
94

హైదరాబాదులో బుధవారం ఆత్మహత్యకు ప్రయత్నించిన మాజీ మిస్ తెలంగాణ హాసిని రెండ్రోజుల వ్యవధిలో మరోసారి ఆత్మహత్యకు యత్నించింది. మొన్న ఫ్యాన్ కు ఉరేసుకున్న యువతి, నేడు మున్నేరులో దూకింది. 21 ఏళ్ల కలక భవాని అలియాస్ హాసిని స్వస్థలం ఏపీలోని కృష్ణా జిల్లా బూదవాడ గ్రామం. మోడలింగ్ పై ఆసక్తితో హైదరాబాదులో ఉంటోంది. 2018లో హాసిని మిస్ తెలంగాణ అందాలపోటీల్లో విజేతగా నిలిచింది. రెండ్రోజుల కిందట హిమాయత్ నగర్ లోని తన అపార్ట్ మెంట్ లో ఫ్యాన్ కు చున్నీతో ఉరేసుకుంది.

తాను చనిపోతున్నానంటూ కుటుంబసభ్యులకు, ఫ్రెండ్స్ కు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. జగిత్యాలకు చెందిన ఓ స్నేహితుడు పోలీసులకు సమాచారం అందించగా..వారు వెళ్లే సరికి చున్నీ ముడి జారిపోవడంతో ఫ్యాన్ నుంచి మంచంపై పడిపోయిన స్థితిలో హాసిని ఉంది. దాంతో ఆమెను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు విషయం వివరించగా, వారు వచ్చి ఆమెను కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామానికి తీసుకెళ్లారు. అయితే నందిగామ సమీపంలోని కీసర వద్ద మున్నేరు బ్రిడ్జిపై నుంచి దూకేసింది. స్థానికులు సకాలంలో గుర్తించి కాపాడడంతో ఆమె ప్రాణాలకు ఎలాంటి ఆపద వాటిల్లలేదు. ప్రస్తుతం నందిగామ ఆసుపత్రిలో హాసిని చికిత్స పొందుతోంది. ఆర్థిక ఇబ్బందులతోనే తాను ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు హాసిని మొన్న పోలీసులకు వెల్లడించింది.