జమ్ముకశ్మీర్​లో ఎదురుకాల్పులు..నలుగురు ముష్కరుల హతం

Four gunmen killed in Jammu and Kashmir clashes

0
86

జమ్ముకశ్మీర్​లోని కుల్గాం జిల్లాలోని రెండు ప్రాంతాల్లో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్​కౌంటర్లలో నలుగురు ముష్కరులను మట్టుబెట్టాయి బలగాలు.  జిల్లాలోని పొంబాయ్​, గోపాల్​పొరా ప్రాంతాల్లో ముష్కరులు ఉన్నారన్న సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా..కాల్పులకు తెగబడ్డారని, అది ఎన్​కౌంటర్​కు దారితీసినట్లు అధికారులు తెలిపారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు చెప్పారు.