జవాన్ల మధ్య గొడవతో కాల్పులు..నలుగురు మృతి

Four killed in firing

0
70

దీపావళి సెలవుల విషయంలో జవాన్ల మధ్య జరిగిన గొడవ కాల్పులకు దారి తీసింది. ఫలితంగా నలుగురు జవాన్లు ఈ కాల్పులలో ప్రాణాలు కోల్పోయారు. చత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా పరిధిలోని లింగంపల్లి బేస్‌క్యాంపులో ఈ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. సీఆర్‌పీఎఫ్ 50వ బెటాలియన్ జవాన్ల మధ్య మొదలైన చిన్నపాటి వాగ్వివాదం తీవ్ర ఘర్షణగా మారింది. అది మరింత ముదరడంతో సంయమనం కోల్పోయిన జవాన్లు పరస్పరం కాల్పులకు తెగబడ్డారు.

ఈ ఘటనలో బీహార్‌కు చెందిన రాజమణి యాదవ్, డంజి, బెంగాల్‌కు చెందిన రాజుమండల్ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ధర్మేందర్ అనే మరో జవాను ప్రాణాలు కోల్పోయారు.