Flash: దారుణం..పుట్టినరోజే బాలికపై గ్యాంగ్ రేప్

0
98

క‌ర్నాట‌క రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కోలార్ జిల్లాకు చెందిన ఒక బాలికపై పుట్టినరోజు నాడే న‌లుగురు కిరాత‌కులు అత్యాచారం చేశారు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ బాలిక.. శుక్రవారం తన పుట్టినరోజున కొత్త బట్టలు, చాక్​లెట్లు కొనివ్వలేదని తల్లిదండ్రులపై అలిగింది. స్కూల్​కి వెళ్లలేదు. బంగారపేట వెళ్లే బస్సు ఎక్కింది. బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన నిందితులు.. మాయమాటలు చెప్పి ఆమెకు దగ్గరయ్యారు. ఆ తర్వాత ఓ పార్క్​కు తీసుకెళ్లి సాయంత్రం వరకు గడిపారు. కాస్త పొద్దపోయిన తర్వాత.. తనిమడగు గ్రామానికి ఓ ప్రైవేటు బస్సులో బాలికను తీసుకెళ్లారు. దారి మధ్యలో నిందితులు మద్యం తీసుకున్నారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.