మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రస్థానం ఇలా..

Minister Mekapati Gautam Reddy's rule like this ..

0
38

ఏపీ వైసిపిలో విషాదం నెలకొంది. ఏపీ పరిశ్రమలు ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి చెందారు. గత వారం రోజుల పాటు దుబాయ్ పర్యటనలో మంత్రి గౌతమ్ రెడ్డి ఉన్నారు. ఐటీ శాఖకు సంబంధించిన వ్యవహారాలపై మంత్రి గౌతమ్ రెడ్డి.. దుబాయ్‌ వెళ్లారు. అయితే.. దుబాయ్‌ పర్యటన చూసుకుని నిన్ననే హైదరాబాద్ కు తిరిగి వచ్చిన మంత్రి గౌతమ్ రెడ్డికు.. ఇవాళ ఉదయమే గుండెపోటు వచ్చింది. దీనితో ఆయనను హుటాహుటీన హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ గౌతమ్ రెడ్డి మృతి చెందారు.

మేకపాటి రాజమోహన్‌ రెడ్డి-మణిమంజరి దంపతులకు 2-11-1971న గౌతమ్ రెడ్డి జన్మించారు. హైదరాబాద్‌ భద్రుకా కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్‌, యూకేలో ఎమ్మెస్సీ టెక్స్‌టైల్స్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు గౌతమ్. 1997లో కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్‌లో వ్యాపార జీవితం మొదలుపెట్టారు. గౌతమ్ రెడ్డి 2014లో ఆత్మకూర్‌ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. దీనితో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.గౌతమ్ రెడ్డి భార్య మేకపాటి శ్రీకీర్తి కాగా వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.

ఇప్పటివరకు రెండుసార్లు గౌతమ్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో వైకాపా తరఫున ఆయన విజయం సాధించారు. గౌతమ్‌రెడ్డి తొలిసారిగా 2014లో ఆనం రామనారాయణ రెడ్డిపై విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ సమయంలో జిల్లాలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన నాయకుడిగా గౌతమ్‌ రికార్డు సృష్టించారు. 2019లో రెండో పర్యాయం ఆయన బొల్లినేని కృష్ణయ్యపై విజయం సాధించి కేబినెట్‌ మంత్రిగా చోటు దక్కించుకున్నారు. గత నెల 22వ తేదీన మేకపాటి గౌతమ్‌రెడ్డి కరోనా బారినపడ్డారు. అప్పట్లో స్వల్పలక్షణాలు ఉండటంతో చికిత్స పొంది కోలుకొన్నారు.