విజయనగరంలో ఘరానా మోసగాడు అరెస్ట్

0
122

సహాయం ముసుగులో ఎం.టి.ఎం.కార్డుల మార్పిడి చేసి మోసాలకు పాల్పడే ఘరానా మోసగాడిని పోలీసులు పట్టుకున్నారు. పూర్తి వివరాలను విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక వెల్లడించారు. 14 కేసుల్లో నిందితుడిగా ఉన్న అతని నుండి రూ.2.30 లక్షల నగదు, 26 గ్రాముల రెండు బ్రాస్లెట్స్, ఎటిఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

విజయనగరం 2వ పట్టణ పోలీసు స్టేషను పరిధిలో ఎం.టి.ఎం. కేంద్రాల వద్ద వృద్ధులు, నిరక్షరాస్యులకు సహాయపడుతున్నట్లుగా నటించి, వారి బ్యాంకు ఖాతాల నుండి నగదును కొల్లగొట్టడమే అతని టార్గెట్. నిందితుడు గుంటూరు పట్టణంకు చెందిన కూరంగి విద్యాసాగర్ గా గుర్తించారు.

జూన్ 25న మధ్యాహ్నం దాసన్నపేట ఎ.టి.ఎం. కేంద్రం వద్ద అనుమానస్పదంగా సంచరిస్తుంటే విజయనగరం 2వ పట్టణ సిఐ సిహెచ్. లక్ష్మణరావుకు వచ్చిన సమాచారం మేరకు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ టి.త్రినాధ్, 2వ పట్టణ సిఐ సిహెచ్. లక్ష్మణరావు, ఎస్బీ సిఐ సిహెచ్. రుద్రశేఖర్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.