రాత్రి సమయంలో ఎటువైపు తిరిగి పడుకుంటే మంచిదో తెలుసా?

0
40

ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారంతో పాటు మంచి నిద్రకూడా అంతే అవసరం. రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చని అందరికి తెలుసు. కానీ రాత్రి పడుకునేముందు చాలామందికి అనేక సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో ఎటువైపు తిరిగి పడుకుంటే మంచిదో అని ఆలోచిస్తుంటారు.

ఎడమ ప్రక్కకు తిరిగి , ఎడమ చెయ్యి క్రిందకు వచ్చే విధంగా పడుకోవడం వల్ల మంచి లాభాలు పొందవచ్చు. ఎందుకంటే మన శరీరంలో సూర్యనాడి , చంద్ర నాడి మరియు మధ్యనాడి అనే మూడు నాడులున్నాయి . సూర్యనాడి భోజనాన్ని జీర్ణం చెయ్యటానికి ఉపయోగపడుతుంది. కావున సూర్య నాడి ఎడమ వైపు తిరిగి పడుకుంటే చక్కగా పని చేస్తుంది .

అంతేకాకుండా ఎడమ వైపున తిరిగి పడుకోవడం వల్ల అలసత్వం తొలగిపోయి..రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకుంటారు. ముఖ్యంగా గురక సమస్య ఉన్నవారు ఎడమ ప్రక్కకు తిరిగి , ఎడమ చెయ్యి క్రిందకు వచ్చే విధంగా పడుకోవడం వల్ల ఈ సమస్య తొలగిపోతుంది.