ఘోరం..భార్యను దారుణంగా చంపిన భర్త..ఆమె తలతో పోలీస్ స్టేషన్ కు

Ghoram..husband who brutally killed his wife..she went to the police station with her head

0
113

తెలంగాణలో దారుణ హత్య కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​లోని ఇమాద్‌నగర్‌లో ఫర్వేజ్ సమ్రిన్​ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. భర్త వేధింపులతో సమ్రిన్ విడాకులు తీసుకుంది. అయితే భార్యకు నచ్చజెప్పిన ఫర్వేజ్​ గతేడాది ఆమెను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.

అప్పటినుంచి ఫర్వేజ్​కు భార్యపై అనుమానం మొదలైంది. తరచూ గొడవలు జరిగేవి. ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు ఇంటికి వెళ్లిన అతను భార్య నిద్రిస్తున్న గదిలోకి వెళ్లాడు. నిద్రపోతున్న ఆమెపై కత్తితో దాడి చేశాడు. అప్పటికి కసితీరక సమ్రిన్ తలను శరీరం నుంచి వేరు చేశాడు. అనంతరం తలను తీసుకుని పోలీస్​స్టేషన్​కు వెళ్లాడు.