Flash: అమ్మాయి గొంతు కోసి యువకుడు పరార్ – వీడియో

0
97

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణ హత్య చోటుచేసుకుంది. ఓ యువతీ గొంతు కోసిన ఘటన అనకాపల్లి జిల్లా మడుగుల గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే..మడుగుల గ్రామానికి చెందిన సిద్ధ స్వాతి అనే అమ్మాయిపై ఆదే గ్రామానికి చెందిన గండం నగేష్ అనే యువకుడు ఆంజనేయ స్వామి గుడి వద్ద  క్రూరంగా బ్లేడుతో మెడపై దాడి చేసాడు. అనంతరం అక్కడినుండి పరారయ్యాడు.

ఆ విషయాన్నీ గమనించిన స్థానికులు తీవ్రంగా గాయపడిన ఆ యువతిని హుటాహుటిగా సమీపంలో ఉన్న ఏరియా ఆసుపత్రికి తరలించారు. అంతలోనే సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బాధితురాలు వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు.

వీడియో చూడాలనుకుంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి..

https://www.facebook.com/alltimereport/videos/356778802926675