కడుపులో మంటకు వెంటనే చెక్ పెట్టండిలా?

0
33

ఈ మధ్య చాలామంది కడుపులో మంట వస్తుందని బాధపడుతున్నారు. ఆ మంట తట్టుకోలేక ఎన్నో చిట్కాలు ప్రయత్నిస్తూ ఉంటారు. దీనికి గల ముఖ్య కారణం కడుపులో యాసిడ్ పైకి ఆహారనాళంలోకి ఛాతీ వరకు తన్నటం వలన జరుగుతుంది. అందుకే దీనివల్ల ఛాతీలో, కడుపులో అసౌకర్యంగా అనిపిస్తుంది. పొగతాగటం, ఊబకాయం, మందులు, మానసిక వత్తిడి, మద్యపానం మరియు సరిగా పోషకాహారం తినకపోవటం వల్ల కూడా ఇలాంటి ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది.

ఈ సమస్య నుండి విముక్తి పొందాలంటే ఈ చిట్కాలు పాటించి మంచి ఫలితాలు పొందవచ్చు. ఆలోవెరాలో చల్లబర్చే లక్షణాలు ఉండడం వల్ల కడుపులో మంటను, గుండెల్లో మంటను, ఛాతిలో మంటను తగ్గించడంతో అద్భుతంగా తోడ్పడుతుంది. చల్లని పాలను తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ట్రిక్ యాసిడ్స్ ను నియంత్రించి కడుపులో మంటను తగ్గిస్తుంది.

చిన్న అల్లం ముక్కను తినడం వల్ల కూడా  కడుపులో మంట తొలగిపోతుంది. యాంటాసిడ్లు ఉన్న ఆహారం తీసుకోవాలి. అంటే అరటిపండు, బొప్పాయి మరియు యాపిల్ వంటి పండ్లు తీసుకోవడం వల్ల మంట తగ్గుపోతుంది. తులసిలో ఉండే మంచి లక్షణాలు వల్ల మీకు మంట నుంచి వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ కారణంగా కూడా మంట తగ్గుతుంది. అందుకే భోజనం చేసిన తర్వాత పెరుగు తీసుకోవడం మంచిది.