కోట్లలో వసూళ్లు..రైల్వే అధికారులపై వేటు

Gold smuggling case: Hunting on railway officials

0
97

విజయవాడ: బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితుడిగా ఉన్న రైల్వే టీటీఐ ఆకుల రాఘవేంద్రరావుపై సస్పెన్షన్ వేటు పడింది. రాఘవేంద్రరావుతో పాటు మరో ముగ్గురు రైల్వే అధికారులను సస్పెండ్ చేశారు అధికారులు. తక్కువ ధరకు బంగారం ఇస్తామంటూ రైల్వేలోని పలువురి ఉద్యోగుల నుండి కోట్లలో వసూళ్లకు పాల్పడ్డారు వీరు. దీనికి సంబంధించి ఓ మహిళతో పాటు నలుగురు రైల్వే ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ నెల 22న ఆకుల రాఘవేంద్రరావును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా..రెండు రోజులుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కారణంగా రైల్వే అధికారులతో పాటు రాఘవేంద్రరావుని రైల్వే ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.