Smuggling:ఒక్కోసారి వీరి స్మగ్లర్స్ తెలివితేటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఆ తెలివితేటలు ఇలా దొంగపనులకు కాకుండా మంచి పనులకు ఉపయోగిస్తే.. వృద్ధిలోకి వస్తారని అనిపించకమానదు. తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారులను ఇద్దరు మహిళా స్మగ్లర్లు (Smuggling)ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ విధంగా కూడా స్మగ్లింగ్ చేయవచ్చా అని ఒక్కసారి షాక్ తిన్నారు సదరు అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే.. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు భారతీయ మహిళలు ముంబై ఎయిర్‌పోర్టులో దిగారు. కానీ వారి నడకలో ఏదో తేడాగా ఉందని అనుమానించి, వారిద్దర్నీ కస్టమ్స్ అధికారులు ఆపారు.
మెుదటగా వారి లగేజీని చెక్ చేయగా, కస్టమ్స్ అధికారులకు ఏమీ దొరకలేదు. దీంతో, మహిళా సిబ్బందితో సదరు మహిళలను సోదా చేయించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆ ఇద్దరు మహిళలు మైనంతో కాళ్లకు పూత పూసుకున్నారు. ఆ మైనాన్ని తొలగించి పరిశీలించిన అధికారులు షాక్ గురయ్యారు. ఆ మైనం పూత అంతా బంగారం అని తెలియటంతో అధికారులకు నోట మాట రాలేదు. ఆ ఇద్దరి కాళ్లకు ఉన్న మైనాన్ని తొలగించి, తూకం వేయగా మెుత్తం బంగారం 2.65 కేజీలుగా తేలింది. మార్కెట్‌లో దీని విలువ 1.39 కోట్ల రూపాయలని అధికారులు అంచనా వేశారు. నిందితులిద్దర్నీ కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకొని, విచారణ చేపట్టారు.
Read also: యశోద సినిమా స్టోరీనే హీరో