Breaking News : ధర్మశాలని ముంచెత్తిన వరదలు ఈ వీడియోలు చూడండి

కుంభవృష్టికి కొండల మీది నుంచి వరద ఉప్పొంగింది

0
103

హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల అంటే తెలియని వారు ఉండరు. ధర్మశాలను వరదలు ముంచెత్తాయి. నగరంతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. కనివిని ఎరుగని రీతిలో ఏకంగా నిన్న ఒక్కరోజే 300 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు చెబుతున్నారు. కుంభవృష్టికి కొండల మీది నుంచి వరద ఉప్పొంగింది.భాగ్సు నాగ్ నాలా నుంచి వరద నీరు భారీగా రావడంతో చుట్టు నీరు భారీగా చేరి ఇళ్లల్లోకి చేరింది.

చాలా వరకూ ఇళ్లు నేలమట్టం అయ్యాయి.. పారిశుద్ధ్య కార్మికుల గుడారాలు కొట్టుకుపోయాయి. పలు కార్లు వరదల్లో కొట్టుకుపోయాయి. ఇక నేల అనేది కనిపించకుండా మొత్తం బురదమయం అయింది. ఈ వరదలతో గుడిసెలు, దుకాణాలు నాశనమయ్యాయి. సిమ్లా జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడడంతో దారి మూసుకుపోయింది.

ఇక్కడ ప్రజలు ఐదు సంవత్సరాలుగా ఇళ్లు కట్టి ఇవ్వాలి అని కోరుతున్నారు. కాని పారిశుద్ద్య కార్మికుల డిమాండ్ ని సర్కారు పట్టించుకోలేదు. మొత్తం బట్టలు, నగదు , సర్వస్వం కోల్పోయాము అని వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ వీడియోలు ఇక్కడ మీరు చడవచ్చు.

ఈ వీడియో చూడండి