నేపాల్లో భారీ వర్షాలు బీభత్సం – ఈ వీడియో చూడండి

Heavy rains lash Nepal

0
114

ఓపక్క కరోనా కేసులు భయపెడుతున్న వేళ, నేపాల్లో భారీ వర్షాలు బీభత్సం సృస్టిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా అక్కడ జలమయం అయ్యాయి. కొండ కోనలు నుంచి భారీగా నీరు కిందకి వస్తోంది. ఏకంగా ఈ వర్షాలకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వరదలు వస్తుండడంతో, కొండచరియలు విరిగిపడుతున్నాయి.

ఆస్తి నష్టానికి సంబంధించి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వరదల్లో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. సింధుపాల్చోక్, మనంగ్ జిల్లాల్లో భారీ నష్టం సంభవించింది.

పర్వతాలపై మంచు కరగడంతో సింధుపాల్ చౌక్ జిల్లాలో వరద పోటెత్తిందని అధికారులు చెప్పారు. ఇంద్రావతి, మేలమ్చి నదుల్లో నీటి మట్టం పెరిగింది. చాలా చోట్ల పవర్ సమస్య వస్తోంది. ఇక చాలా చోట్ల రవాణాకి కూడా ఇబ్బంది కలుగుతోంది.

ఈ వీడియో చూడండి