Breaking News : విద్యా సంస్థల ప్రారంభం పై తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు

The Telangana government has given key directions on starting educational institutions

0
46

తెలంగాణలో కరోనా కేసులు త‌గ్గుముఖం పట్టడం, లాక్‌డౌన్ ఎత్తివేత‌తో అన్ని కేటగిరీల విద్యా సంస్థలను పూర్తిస్థాయి సన్నద్థతతో జూలై 1 నుంచి ప్రారంభించాలని ప్ర‌భుత్వం విద్యాశాఖను ఆదేశించింది.పూర్తిస్థాయి సన్నద్థతతో జులై 1 నుంచి అన్ని రకాల విద్యాసంస్థలను ప్రారంభించాలని నిర్ణయంచిది కేబినెట్ .

శ‌నివారం స‌మావేశమైన తెలంగాణలో రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. ప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశంతో ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని కేబినెట్ కోరింది.

లాక్ డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని. తప్పని సరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం ,తదితర కరోనా స్వీయ నియంత్రణ విధానాలను విధిగా పాటించాలన్నది. అందుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలని కేబినెట్ స్పష్టం చేసింది. కరోనా పూర్తిస్థాయి నియంత్రణకు ప్రజలు త‌మ‌ సంపూర్ణ సహకారం అందించాలని కేబినెట్ కోరింది.