ఎవరూ చేయని దారుణమైన పని చేసిన హిజ్రా – ఆ దేవుడు కూడా క్షమించడు

Hijra who did the worst thing that no one else did

0
117

ముంబైలో దారుణం జరిగింది. నగరంలో ఓ హిజ్రా చేసిన దారుణం అందరినీ షాక్కు గురిచేసింది. ఏదైనా పెళ్లి జరిగినా ఫంక్షన్ జరిగినా ఈ హిజ్రాలు అక్కడకు వెళతారు. వారు అడిగినంత డబ్బులు ఇవ్వాలి. లేకపోతే అక్కడ కొందరు ఎంత రచ్చ చేస్తారో తెలిసిందే. ఇక్కడ సచిన్ చిత్తోల్ కుటుంబం నివాసం ఉంటోంది. ఆ కుటుంబంలో పాప పుట్టిందని తెలుసుకున్న అదే ప్రాంతానికి చెందిన కన్హయ చౌగులే అలియాస్ కణ్ణు అనే హిజ్రా అక్కడకు వెళ్లింది.

పాపని దీవిస్తాను నాకు 1100 ఇవ్వాలి అని అడిగింది.లాక్డౌన్ కారణంగా తనకు పని లేకుండా పోయిందని అంత ఇవ్వలేను అని చీర పెట్టి, కొబ్బరికాయ ఇస్తాము అని తెలిపారు. కానీ డబ్బులివ్వాలని డిమాండ్ చేసింది. చివరకు ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆ హిజ్రాని అక్కడ నుంచి గెంటివేశారు. దీంతో ఆమె కోపంతో రగిలిపోయింది.

హిజ్రా తన స్నేహితుడైన సోనూ కాలేకు జరిగిందంతా చెప్పింది. ఇక అర్ధరాత్రి వారి ఇంటికి వెళ్లి నిద్రపోతున్న సమయంలో మూడు నెలల వయసున్న చిన్నారిని కిడ్నాప్ చేశారు. కొద్ది సేపటికి తల్లి లేచి చూస్తే పిల్లలేదు. దీంతో వెంటనే పాపని వెతికారు. కనిపించకపోవడంతో పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఎవరితో అయినా గొడవలు ఉన్నాయా అంటే హిజ్రాతో జరిగిన గొడవ చెప్పారు. దీంతో పోలీసులు ఆమెని అరెస్ట్ చేసి విచారిస్తే ఆమె నిజం ఒప్పుకుంది. ఆ పాపను తీసుకెళ్లి తగలబెట్టినట్టు హిజ్రా చెప్పింది. ఈ దారుణమైన ఘటనతో అందరూ షాక్ అయ్యారు. ఇంత దారుణానికి తెగించిన ఆ హిజ్రాని సహకరించిన వారిని ఉరితీయాలి అని అంటున్నారు జనం.