నదిని కాపాడుకునేందుకు వీరు ఏం చేస్తున్నారో తెలిస్తే శభాష్ అంటారు

This is what they did to save the river

0
34

మనకి చలి వేస్తే వెంటనే దుప్పటికప్పుకుంటాం .ఇక జంతువులు కూడా కాస్త వెచ్చగా ఉండే ప్రాంతానికి వెళతాయి. అయితే ఏకంగా అధిక వేడి వల్ల ఓ నదిలో మంచు కరిగిపోతోంది. దీంతో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు అక్కడ అధికారులు. ఉత్తర ఇటలీలో ఇటీవలి కాలంలో ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోయాయి. వేడి అధికం కావటంతో అక్కడ ఉన్న ప్రెసేనా హిమనీనది క్రమేపీ కరిగిపోతుంది. దీంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ నదిని కాపాడుకోవాలి అని ఈ వేడి కిరణాలు పడకుండా ఉండేందుకు మంచునదిపై మందం కలిగిన టార్పాలిన్ కప్పేశారు. అయితే ఇదేమి చిన్నది కాదు ఏకంగా ప్రపంచంలో ఇప్పటి వరకూ ఎక్కడా లేనంతగా 120,000 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో దీనిని కప్పుతున్నారు. సుమారు నెల రోజులుగా ఈ వర్క్ జరుగుతోంది.

1993 నుండి ప్రెసేనా హిమనీనది వేడి కారణంగా ఒక వంతు మంచును కోల్పోయింది. ఇక ఈ నదిని కాపాడుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల చాలా వరకూ మంచు కరగడం ఆగింది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇలా చాలా చోట్ల మంచు కరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల పర్యావరణం కూడా దెబ్బతింటోంది.