Breaking: ఘోరం..మైనర్ బాలికపై డ్రైవర్ అత్యాచారం

0
86

దేశంలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు నిత్యం జరుగుతున్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చిన నిందితుల్లో కఠిన శిక్షలు వేసిన వారిలో మార్పు రావట్లేదు. అత్యాచారాలకు పాల్పడే వారి కోరికలకు ముక్కుపచ్చలారని చిన్నారులు బలవుతున్నారు. తాజాగా తెలంగాణాలో ఘోరం జరిగింది.  కరీంనగర్‌ వీణవంక మండలం మల్లారెడ్డిపల్లిలో ఈ దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై జేసీబీ డ్రైవర్ అత్యాచారానికి ఒడిగట్టాడు. మైనర్ బాలికకు మాయమాటలు చెప్పిన డ్రైవర్ గుటిలోకి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.