ఘోరం..యువతిపై గ్యాంగ్ రేప్..మద్యం తాగించి ఆపై..

0
104

దేశంలో స్త్రీలకు రక్షణ కరువైంది. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చిన నిందితుల్లో మార్పు రావడం లేదు. దగ్గరి వాళ్లే నమ్మించి నయవంచన చేస్తున్నారు. కామంతో కాటేస్తూ మహిళల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. దీనితో వారి భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. తాజాగా చెన్నైలో ఘోరం జరిగింది.

నగర శివార్లలో ఓ యువతికి మద్యం తాగించి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు నీచులు. యువతిని బెదిరించి రేప్ చేశారు కీచకులు. ఈ ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులు పరారయ్యారు. నిందితుల్లో ఒకడు న్యాయవాది, మరొకడు బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.

చెంగల్‌పట్టుకి చెందిన యువతి ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. స్థానికంగా ఉండే శరవణన్‌ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఎప్పటిలానే విధులు ముగించుకొని యువతి ఇంటికి వెళ్తుండగా దారిలో ఆమెకు కారులో వెళ్తున్న శరవణన్ కనిపించాడు. తన కారులో ఇంటి దగ్గర దిగబెడతానని శరవణన్ చెప్పాడు. ఫ్రెండ్ కావడంతో ఆమె అతడిని నమ్మి కారు ఎక్కింది. యువతిని తన కారులో తీసుకెళ్లిన శరవణన్.. కారులో బలవంతంగా ఆమెతో మద్యం తాగించాడు. కారులో ఉన్న తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత యువతిని రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు.