విజయ్ దేవరకొండ న్యూడ్ పిక్..సోషల్ మీడియాలో వైరల్

0
39

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమాతో ఫుల్ బిజీగా వున్నాడు. ఈ సినిమాను డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తుండగా..అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తరువాత వీరి కాంబినేషన్ లోనే ‘జనగణమన’ సినిమా రాబోతుంది.

ఇది పూరి కలల ప్రాజెక్ట్ కావడం విశేషం. ‘లైగర్’ ఆగస్టు 25న విడుదలకానుంది. మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో రౌడీ హీరో బాక్సర్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది. దీంతో అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది టీమ్. అందులో భాగంగా లైగర్ టీమ్ ఓ పోస్టర్‌ను వదిలింది. ఆ పోస్టర్‌లో విజయ్ న్యూడ్‌గా దర్శనమిచ్చారు. గులాబీలను అడ్డు పెట్టుకుంటూ ఉన్న ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇక లైగర్ కథ విషయానికి వస్తే.. ముంబైలో ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముడు జీవనం గడిపే ఓ ఫ్యామిలీ కుర్రాడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా మారాడనేదే కథలా కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు.