ఘోరం..ఆరో తరగతి బాలికపై అత్యాచారం

0
104

రోజురోజుకు దేశంలో అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. మానవ రూపంలో ఉన్న మృగాల ఆకృత్యాలకు ముక్కుపచ్చలారని చిన్నారులు బలవుతున్నారు. తాజాగా ఝార్ఖండ్ లో ఘోరం జరిగింది. పాఠశాల నుంచి ఇంటికెళ్తున్న ఆరో తరగతి బాలికను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి, ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు. డమ్కా జిల్లా గోపికందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.