ఇండియా-ఇంగ్లాండ్ రెండో టీ20..కళ్లన్నీ అతని మీదే!

0
53

ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టీ 20లో ఇండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇదే ఊపులో నేడు జరగబోయే రెండో మ్యాచ్ లోను విజయభేరి మోగించాలని తహతహలాడుతుంది. మొదటి మ్యాచ్ కు అందుబాటులో లేని కోహ్లీ, పంత్, జడేజా, బుమ్రా అందుబాటులోకి రావడం శుభపరిణామం కాగా జట్టుకు కొండంత బలం.

మరోవైపు ఇంగ్లాండ్ ఓటమిని దిగమింగుకొని విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. మొదటి మ్యాచ్ ను దృష్టిలో పెట్టుకొని ఇంగ్లాండ్ తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే జట్టులోని బట్లర్‌, రాయ్‌, మలన్‌, లివింగ్‌స్టోన్‌, మొయిన్‌ అలీ.. వీళ్లంతా ఎవరికి వారు ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపించగల విధ్వంసకారులే. ఏ ఇద్దరు మ్యాచ్ లో నిలబడ్డ ఇంగ్లాండ్ విజ్జయం తధ్యం.

అయితే ఈ మ్యాచ్ లో కోహ్లి మీదే అందరి దృష్టి నిలిచి ఉంది. రెండేళ్లకు పైగా ఏ ఫార్మాట్లోనూ సెంచరీ చేయని అతను.. ఇటీవల మరీ తీసికట్టుగా ఆడుతున్నాడు. అర్ధశతకాలు కూడా కరవైపోతున్నాయి. ఇంగ్లాండ్‌తో చివరి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 31 పరుగులే చేశాడు. గత ఏడాది టీ20ల్లో తాను చివరగా కెప్టెన్‌గా వ్యవహరించిన ప్రపంచకప్‌ తర్వాత అతను ఈ ఫార్మాట్లో ఆడింది రెండే మ్యాచ్‌లు. ఏడాది చివర్లో జరిగే టీ20 ప్రపంచకప్‌నకు రేసులో ఉండాలంటే ఇంగ్లాండ్‌తో చివరి రెండు టీ20ల్లో అతను సత్తా చాటాల్సిందే.

తుది జట్లు (అంచనా)
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), కోహ్లి, ఇషాన్‌/దీపక్‌, సూర్యకుమార్‌, హార్దిక్‌, పంత్‌/కార్తీక్‌, జడేజా/అక్షర్‌, చాహల్‌, భువనేశ్వర్‌, బుమ్రా, హర్షల్‌ పటేల్‌.

ఇంగ్లాండ్‌: బట్లర్‌ (కెప్టెన్‌), రాయ్‌, మలన్‌, లివింగ్‌స్టోన్‌, బ్రూక్‌, మొయిన్‌ అలీ, సామ్‌ కరన్‌, జోర్డాన్‌, టాప్లీ, మిల్స్‌/విలీ, పార్కిన్సన్‌.