హరియాణాలో డీఎస్పీ హత్య జరిగిన రోజే ఝార్ఖండ్‌లో అదే తరహా దారుణం చోటు చేసుకుంది. రాంచీలో నేరస్థులు ఓ మహిళా ఎస్సైని దారుణంగా హత్య చేశారు. మంగళవారం రాత్రి ఓ చెక్‌పాయింట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై సంధ్య.. దారిలో వెళ్తున్న ఓ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులను పట్టించుకోకుండా నిందితులు.. వాహనాన్ని ముందుకు పోనిచ్చారు. ఈ క్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ సంధ్యపై నుంచి వాహనం దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను రిమ్స్‌కు తరలించగా అక్కడే ప్రాణాలు కోల్పోయారు.