ఘోరం..మైనర్‌ బాలిక చేత మద్యం, బీడి తాగించిన యువకులు..

0
103

దేశంలో రోజురోజుకు దారుణాలు పెరుగుతున్నాయి. హత్యలు, దొంగతనాలు, ఆత్మహత్యలు, అత్యాచారాల వంటి ఘటనలు నిత్యం జరుగుతున్నాయి. నిందితులకు కఠిన శిక్షలు వేసిన వారిలో మార్పు కనిపించడం లేదు. వీరి అఘాయిత్యాలకు చిన్న పిల్లలు బలవుతున్నారు. ఇక తాజాగా ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది.

ఓ 10 ఏళ్ల బాలిక గత నెలలో మద్యం సేవించి, బీడీలు కాలుస్తూ, పొగ తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో సామాజిక కార్యకర్తలు, ప్రజల్లో దీనిపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. అయితే ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న చైల్డ్ ప్రొటెక్షన్ శాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. ఈ విచారణలో సంచలన విషయాలు బయటకొచ్చాయి.

బాలిక జ్యోతికి అదే ప్రాంతానికి చెందిన కొందరు యువకులు మద్యం తాగించి, బీడీ తాగించారని వెలుగులోకి వచ్చింది. దీంతో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి శివకాంతి డెంకనికోట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులు అదే ప్రాంతానికి చెందిన సంగయ్య (22), కుమార్ (21), రమేష్ (22), శివరాజ్ (27), రుద్రప్ప (26), అళగప్పన్ (26) అనే ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరితో పాటు పరారీలో ఉన్న శివరుద్రప్ప, మల్లేష్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరెస్టు చేసిన వారందరినీ కోర్టులో హాజరుపరిచి హోసూరు జైలుకు తరలించారు.