డేంజర్: ఒకే వ్యక్తిలో కరోనా, మంకీపాక్స్-అధికారుల హైఅలర్ట్‌

0
38

ఓ వైపు కరోనా..మరోవైపు మంకీపాక్స్ ఇప్పుడు ఈ రెండు వైరస్ లు టెర్రర్ పుట్టిస్తున్నాయి. కరోనా కేసులు భారీగా పెరుగుతుండడం, మంకీపాక్స్ కేసులు వెలుగుచూడడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక తాజాగా  ఒకే వ్యక్తిలో మంకీపాక్స్, కరోనా వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. అమెరికాకు చెందిన ఓ వ్యక్తిలో రెండు వైరస్‌లను గుర్తించారు.

ఒకే వ్యక్తిలో రెండు వైరస్‌లను గుర్తించడం ఇదే మొదటిసారి. దీంతో మంకీపాక్స్‌ను సైతం ప్రపంచ ఆరోగ్య అత్యవసర స్థితిగా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. వైరస్‌ సోకిన వారికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వారికి ఇది సోకుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.

మరోవైపు అమెరికాలో ఇప్పటి వరకు 2,400 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఇద్దరు పిల్లల్లో మంకీపాక్స్ నిర్ధరణ అయింది. ఈ వైరస్‌ సన్నిహితంగా మెలిగిన వారికి సోకుతుంది. ఫ్లూ, శరీరంపై బొబ్బల వంటి లక్షణాలు కనిపిస్తాయి. అమెరికాలో ఇప్పటికే కరోనా వైరస్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి. బీఏ5 వేరియంట్‌ వేగంగా విజృభిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. జులై 19న అత్యధికంగా ఒక్క రోజే 1.7 లక్షల కేసులు వచ్చాయి.