Kerala |కేరళలోని కోజీకోడ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఓ హోటల్ యజమాని సిద్ధిఖ్‌ని కొందరు గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. శరీర భాగాలను సూట్‌కేస్‌లో అమర్చి దగ్గర్లోని కాలువలో పడేశారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్ సాయంతో కాలువలోని శరీరభాగాలను గుర్తించారు. హోటల్ సిబ్బందే హత్య చేశారని నిర్ధారించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.