హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం

0
91
Kabul

హైదరాబాద్: రాజేంద్ర నగర్‌లోని ఓ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మైలర్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్‌నగర్ బస్తిలో ఉన్న కాటన్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పరిశ్రమ మొత్తానికి విస్తరించినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న మైలారద్‌దేవ్ పల్లి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పరిశ్రమలో భారీగా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. భయాందోళనకు గురి అయిన చుట్టు పక్కల ప్రజలు భయంతో పరుగులు తీశారు.

దీంతో మంటలను అదుపు చేయడాని ఫైర్‌ సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. రెండు ఫైర్ ఇంజిన్ల సిబ్బంది గంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.