ఏపీలో మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

Beginning of counting of municipal election votes in AP

0
34

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. సాధారణ ఎన్నికలను తలపించిన ఈ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. నెల్లూరు నగరపాలక సంస్థ, కుప్పం సహా 12 మునిసిపాలిటీలతో పాటు సోమవారం పోలింగ్ జరిగిన అన్ని చోట్ల ఈ లెక్కింపు ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ప్రారంభమైంది. పది గంటలకల్లా ఓటింగ్ సరళి తెలిసిపోనుంది. సాయంత్రానికి తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.