Flash- పంజాగుట్టలో యువతి హల్ చల్

0
93

హైదరాబాద్ లోని పంజాగుట్ట ప్రధాన రహదారిపై ఓ యువతి హల్ చల్ చేసింది. రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుకొని యువతిని తరలించారు.

ఆ యువతి పోలీసులకు చుక్కలు చూపించింది. మహిళా కానిస్టేబుళ్లు లేకపోవడంతో సదరు యువతిని తరలించడం పోలీసులకు సవాల్ గా మారింది. ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ యువతిని పట్టుకోబోతుండగా తీవ్ర బెదిరింపులకు పాల్పడింది యువతి.

అయితే ఆ యువతీ గత కొద్ది రోజుల నుంచి ఇలాగే ఇబ్బందికి గురి చేస్తుందని చుట్టుపక్కల దుకాణదారులు వాపోతున్నారు. వాళ్ల షాప్ ముందు పార్క్ చేసిన వెహికల్స్ ని కింద పడేసి ఇబ్బంది పెడుతుందని వారు ఆరోపించారు. సదరు విషయం ఎవరికీ చెప్పినా పట్టించుకోవడం లేదని దుకాణదారులు తెలిపారు.