వైఎస్ షర్మిలకు బిగ్ షాక్..ఎన్నికల సంఘం ట్విస్ట్..నిరాశలో అభిమానులు

Big shock for YS Sharmila..Election community twist..Fan in despair

0
42

తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించిన వైఎస్ షర్మిలకు ఇప్పుడు ఎన్నికల కమిషన్ భారీ షాక్ ఇచ్చింది. గత ఏడాది తన తండ్రి జన్మదినం నాడు రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యమంటూ షర్మిల అట్టహాసంగా తన పార్టీ పేరు వైఎస్సార్టీపీగా ప్రకటించారు. ఇప్పుడు అదే పేరుతో పార్టీ కొనసాగింపుకు ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీంతో..పార్టీ రిజిస్ట్రేషన్ సైతం నిలిచిపోయింది. అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం మేరకు షర్మిల పార్టీ రిజిస్ట్రేషన్ ను నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది.

వైయస్ షర్మిలకు మరికొన్ని ఇతర పేర్లు సూచించాలని ఈనెల 3వ తేదీన లేఖ రాసినట్లు ఎన్నికల సంఘం మహబూబ్ బాషాకు వ్రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపింది. దీంతో వైయస్ షర్మిల అభిమానులు షాక్ కు గురయ్యారు. ఇప్పటికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో షర్మిల కార్యక్రమాలను సైతం మొదలుపెట్టారు. కాగా భారత ఎన్నికల సంఘం పంపిన లేఖతో వైఎస్ షర్మిల అభిమానులు నిరాశకు గురవుతున్నారు.

షర్మిలకు వైయస్సార్ పేరుతోనే పార్టీ కావాలంటే మహబూబ్ బాషాతో రాజీ కావడం తప్ప ఇతర మార్గం కనిపించడం లేదు. లేకపోతే వైఎస్ఆర్ పేరు లేకుండా వేరే పేరు పెట్టుకోవడం ఆమెకు ప్రత్యామ్నాయంగా మిగిలింది. కాగా 2 తెలుగు రాష్ట్రాల్లో వైయస్సార్ పేరుతో భారత ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిన ఏకైక పార్టీ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని మహబూబ్బాషా,అబ్దుల్ సత్తార్ వెల్లడించారు.