కాలిన స్థితిలో భార్యాభర్తల మృతదేహాలు..హత్యా..ఆత్మహత్యా?

Husband and wife's bodies in a burnt condition..homicide..suicide?

0
79

తెలంగాణలోని కామారెడ్డిలో విషాదం చోటు చేసుకుంది. గోసాంగికాలనీకి చెందిన దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పట్టణానికి చెందిన సాయిలు(40), పోచవ్వ(35) ఈ నెల 28 న ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అప్పటి నుంచి ఆచూకీ లేని దంపతులు..విగతజీవులుగా కనిపించారు.

కాలిన స్థితిలో సాయిలు మృతదేహం లభ్యమైంది. ఆ పక్కనే నీటిగుంతలో భార్య పోచవ్వ మృతదేహం కనిపించింది. దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకునారా లేక హత్యా అనేది తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన కామారెడ్డి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.