ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమాపై రాజ‌మౌళి సంచలన కామెంట్స్‌

Rajamouli sensational comments on the movie with Pawan Kalyan

0
41

బాహుబ‌లి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఇప్పుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో RRR భారీ ముల్టీస్టారర్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తుండగా..గిరిజన వీరుడు కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం జనవరి 7వ తేదీన విడుదల చేయనున్నారు. మొదటి సింగిల్ ‘దోస్తీ’ ప్రేక్షకులను అలరించాయి. డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రియ శరణ్ వంటి పలువురు ప్రముఖులు ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు.

ఈ సినిమాకు జోరుగా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతుండ‌గా, రాజ‌మౌళి ప‌లు ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. ఆ స‌మ‌యంలో ప్ర‌భాస్‌, రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌.. ఈ ముగ్గురితో మీరు ప‌నిచేశారు. మీ దృష్టిలో మీరు ఎవ‌రికీ ఓటేస్తారు? అని ఒక‌రు ప్ర‌శ్నించారు. దానికి రాజ‌మౌళి సినిమా గురించి, యాక్టింగ్ గురించి ఏదైనా మాట్లాడాలంటే ఎన్టీఆర్‌తో స‌మ‌యం గ‌డ‌ప‌టానికి ఇష్ట‌ప‌డ‌తాను. జంతువుల గురించి తెలుసుకోవ‌డానికి గంట‌ల స‌మ‌యం వెచ్చిస్తాను. వాటి గురించి మాట్లాడాలంటే రామ్‌చ‌ర‌ణ్‌తో స‌మ‌యం గ‌డ‌ప‌టానికి ఇష్ట‌ప‌డ‌తాను. అలాగే పుడ్ గురించి మాట్లాడాలంటే ప్ర‌భాస్‌తో టైమ్ స్పెండ్ చేస్తానని రాజ‌మౌళి తెలిపారు.

పవన్ కళ్యాణ్ తో సినిమాపై కూడా ఓపెన్ అయ్యారు అయ్యారు జ‌క్కన్న. ఎప్పుడో గత కొన్నేళ్ల కితం ఆయనకు కథ చెప్పడం జరిగింది అని అయితే ఆ టైం కళ్యాణ్ మళ్ళీ చెప్తాను అని అన్నారు కానీ తర్వాత ఎటువంటి కాల్ రాకపోవడం ఇక ఇద్దరు సినిమా దారులు కూడా వేరైపోవడం జరిగిందని తెలిపారు.