చన్నీళ్లతో స్నానం చేస్తే మంచిదా..కాదా?

Is it better to take a bath with channels?

0
46

చాలా మంది చన్నీళ్ల స్నానమంటేనే భయపడుతారు. ఒంట్లో వణుకు ఎందుకు అని దీనికి దూరంగా ఉంటారు. చలికాలంలో ప్రతి ఒక్కరు వేన్నీళ్ల స్నానం చేసేందుకే ప్రాధాన్యతను ఇస్తారు. అయితే అయితే వేడి నీటి కంటే చన్నీళ్ల స్నానంతోనే ఆరోగ్యకర ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని =వైద్యులు చెబుతున్నారు. చల్లటి నీటితో స్నానం అనే ఆలోచన వస్తేనే జంకుతాం. కానీ, కొంచెం ధైర్యం చేసి చన్నీటితో స్నానం చేశామంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. గొప్ప శక్తిని, ఇమ్యూనిటీని అందిస్తుంది. చల్లని నీటితో స్నానం చేయడం వలన శరీరంలో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది. అందమైన చర్మం, ఆరోగ్యకరమైన జట్టును సొంతం చేసుకోవచ్చు.

మొదట్లో వేడి నీటితో స్నానం చేసినా.. చివర్లో కేవలం 30 సెకన్ల పాటు చన్నీటిని నెత్తిపై పోవడం ద్వారా ఈ ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు. ఆరోగ్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం ఇలా చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయట. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

శరీరానికి చలి తగిలినప్పుడు ఎక్కువ తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. తద్వారా ఇన్‌ఫెక్షన్లతో పోరాడే శక్తి పెరుగుతుంది. వేడి నీటితో స్నానం చేసిన తరువాత చివర్లో 30 సెకన్లు 50 ఫారెన్‌హీట్‌ల చల్లని వాటర్‌తో స్నానం చేస్తే ఈ ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

చల్లని నీటితో స్నానం శరీరానికి శక్తిని, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుంది. రోజంతా మనసుకు ప్రశాంతత, ఆహ్లాదం లభిస్తుంది.

వేడి నీటి కంటే చల్లని నీరు జుట్టు సంరక్షణకు చాలా మంచిది అని డెబ్రా జలిమాన్ తెలిపారు. వేడి నీటితో స్నానం చేయడం ద్వారా మెరిసే గుణం, జుట్టులోనే సహజ నూనెలు తొలగిపోతాయి. తద్వారా జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది.

గుండె సంబంధిత వ్యాధులు, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్న వ్యక్తులు చన్నీటితో స్నానం చేసే ముందు జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతున్నారు. వేడి నీటితో స్నానం చేసిన తరువాత, చివరలో 30 సెకన్లు చన్నీటితో స్నానం చేయడం ఇలాంటి వ్యక్తులకు ప్రమాదకరం అని తెలిపారు. గుండె సంబంధిత వ్యాధులు కలిగిన వారు.. 10°C కంటే తక్కువగా ఉష్ణోగ్రత కలిగిన నీటితో స్నానం చేయొద్దని, ఒకవేళ చేయాలనుకుంటే నిపుణులను సంప్రదించి చేయాలని సూచిస్తున్నారు.