సవతితో కలిసి భర్తను హత్య చేసి.. ఫోన్ లో మల్లెపూలు, మటన్ అంటూ అడ్డంగా బుక్కైన భార్య

-

Hyderabad auto driver murder case at jeedimetla: హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ గాంధీనగర్ లో సోమవారం జరిగిన ఆటో డ్రైవర్ హత్య సంచలనం సృష్టించింది. ఈ కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వ్యసనాలకు బానిసైన భార్య తన సవతి తో కలిసి భర్తను హత్య చేయించడం అందరినీ షాక్ గురి చేసింది. కాగా నిందితురాలు రేణుక భర్తకు దగ్గరుండి మరీ రెండో పెళ్లి చేయడమే కాకుండా.. ఆమెతో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేయడం షాకింగ్ ట్విస్ట్.

- Advertisement -

స్థానిక సమాచారం ప్రకారం.. సోమవారం హత్యకు గురైన సురేష్(28), రేణుక 2016లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్లైన కొద్దిరోజలకే రేణుక చెడువ్యసనాల బాట పట్టింది. నిత్యం కల్లు దుకాణాలు, మద్యం దుకాణాల వద్ద తిష్ఠ వేసింది. పరాయి వ్యక్తులతో మాటలు కలిపేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం బహదూర్పల్లిలోని ఓ కల్లు దుకాణం వద్ద దుండిగల్ తండాకు చెందిన అనాథ బాలికతో రేణుకకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. బాలికకు ఎవరూ లేకపోవడంతో తమ ఇంటికి తీసుకొచ్చింది రేణుక. 15 రోజులుగా అందరూ కలిసుంటున్నారు. భర్త మెప్పు పొందేందుకు ఇంట్లోనే రహస్యంగా బాలికతో అతనికి పెళ్లి చేసింది. అయితే బాలిక తనకు దగ్గరవ్వడంతో సురేష్.. రేణుకను వదిలించుకోవాలని చూసినట్లు సమాచారం. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో భర్త హత్యకు బాలికతో కలిసి పథకం వేసింది రేణుక. ఆదివారం రాత్రి భర్తతో సహా ముగ్గురూ కలిసి మద్యం తాగారు. భర్త మద్యం మత్తులో నిద్రపోవడంతో బాలికతో కలిసి శాలువాను అతని మెడకు బిగించి.. ఇద్దరూ కలిసి రెండువైపులా గట్టిగా లాగడంతో ఊపిరాగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శవాన్ని ఓ సంచిలో పెట్టి రెండో అంతస్తు నుంచి ఇంటి ముందు రోడ్డుపై వదిలేశారు. నేరం నుంచి తప్పించుకునేందుకు కట్టుకథ అల్లారు. చంపిన అనంతరం సురేష్ బంధువులకు ఫోన్లు చేసి, తినేందుకు మటన్, మల్లెపూలు తీసుకురావాలని అతనిని బయటకు పంపించానని, తిరిగి రాలేదని రేణుక నమ్మబలికింది. మరుసటి రోజు తన భర్తను ఎవరో చంపి.. ఇంటి ముందే మృతదేహాన్ని వదిలేసినట్లు వాపోయింది. ఏమీ తెలియనట్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లి విలపించింది. బంధువులు భార్యపై అనుమానం ఉందని చెప్పడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...