సరికొత్త స్టోర్స్ ని లాంచ్ చేసిన బిర్కెన్ స్టాక్ ఇండియా

0

Birkenstock India: మరో కొత్త స్టోర్‌ని లాంచ్‌ చేయడం ద్వారా దక్షిణ భారతదేశంలో తన ఉనికిని మరోసారి చాటుకున్న బిర్కెన్‌స్టాక్‌ ఇండియా

ప్రపంచ  ఫుట్‌వేర్‌ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ప్రముఖ జర్మన్‌ ఫుట్‌వేర్‌ బ్రాండ్‌ బిర్కెన్‌స్టాక్‌. దక్షిణ భారతదేశంలో మరింతగా తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు మరో రెండు స్టోర్స్‌ని హైదరాబాద్‌లోని నెక్సస్‌ మాల్‌ మరియు శరత్‌ సిటీ మాల్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

దేశవ్యాప్తంగా తమ బ్రాండ్‌ని మరింతగా విస్తరించే స్థిరమైన ప్రణాళికతో వేగంగా ముందుకెళ్తోంది. అందులో భాగంగా జూబ్లిహిల్స్‌ హైదరాబాద్‌తో పాటు లులు మాల్, కొచ్చి, ఎక్స్‌ప్రెస్ అవెన్యూ మాల్, చెన్నై మరియు ఓరియన్ మాల్, బెంగళూరులో ఏర్పాటు చేసింది.

బిర్కెన్‌స్టాక్‌ ఎంతో చరిత్ర కలిగిన కంపెనీ. ఇది 1774 నుంచి తమ ఉత్పత్తులను ప్రజలకు అందిస్తోంది. అసాధారణమైన సౌలభ్యం మరియు అధునాతన ఫుట్‌బెడ్ టెక్నాలజీకి ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ బ్రాండ్‌. ఇది ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ ఫ్యాషన్‌లతో ఉత్పత్తులను అందిస్తుంది. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ సరికొత్త స్టోర్‌లలో లేటెస్ట్‌ కలెక్షన్‌ అన్నీ ఉన్నాయి. అన్నింటికి మించి త్వరలో స్ప్రింగ్ సమ్మర్ 2023 కలెక్షన్‌ కూడా ఈ స్టోర్‌లోకి రాబోతున్నాయి.

ఎగువ గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న ఈ రెండు స్టోర్‌లు అరిజోనా, గిజే లేదా మాడ్రిడ్ వంటి టైమ్‌లెస్ క్లాసిక్‌లను కలిగి ఉంటాయి. లేటెస్ట్‌ కలెక్షన్‌లో పెద్దలు మరియు పిల్లల కోసం అన్ని సైజుల్లో, అద్భుతమైన కలర్స్‌ మరియు డిజైన్స్‌తో అందుబాటులో ఉన్నాయి. నెక్సస్‌ మాల్‌లో 690 చదరపు అడుగులు మరియు శరత్‌ సిటీ మాల్‌లో 1900 చదరపు అడుగుల విస్తీర్ణంతో వీటిని ఏర్పాటు చేశారు. జర్మనీ యొక్క అతిపెద్ద ఫుట్‌వేర్‌ తయారీదారు అయినటువంటి ఈ సంస్థ నుంచి మొత్తం 250కి పైగా ఎక్కువ మోడళ్ల ఉన్నాయి.

నగరం మధ్యలో ఏర్పాటు చేసిన ఈ కొత్త స్టోర్‌లు కొత్త మరియు ప్రత్యేకమైన స్టైల్‌లకు అనుగుణంగా కొనసాగుతాయి. దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, ఫ్యాషన్ డిజైనర్లు, స్టైల్ ఐకాన్‌లు మరియు వినియోగదారులకు అత్యంత ఇష్టమైన నెక్సస్ మాల్ మరియు శరత్ సిటీలోని కొత్త స్టోర్‌లు నిజంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here