మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన.. సెర్ప్ ఉద్యోగుల్లో ఫుల్ జోష్

0
Telangana budget

Telangana budget: నేడు రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో సర్ప్ ఉద్యోగులకు ఏప్రిల్ నుంచి పే స్కేల్ వర్తింప చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల సెర్ప్ ఉద్యోగ సంఘాల రాష్ట్ర జేఏసీ నాయకులు కుంట గంగాధర్ రెడ్డి, నరసయ్య, సుదర్శన్ వెంకట్, సురేఖ, మహేందర్ రెడ్డి, సుభాష్ లు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.

23 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో నామమాత్రపు ఉద్యోగ భద్రతతో 50 లక్షల మహిళల సంక్షేమమే ధ్యేయంగా, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల అమలులో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్న తమకు ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో తగిన గుర్తింపు దక్కుతోందని జేఏసీ నాయకులు ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు.

ఈ పేస్కేలు ద్వారా సెర్ప్ సంస్థలో పనిచేస్తున్న 3974 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం వేతనాలకు ఏటా రు. 192 కోట్ల బడ్జెట్ ఉండగా దీనికి మరో 42 కోట్లు అదనంగా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడనుంది కాగా సెర్ప్ ఉద్యోగులకు పేస్కేలు వర్తించడంతో 23 సంవత్సరాలుగా పడుతున్న వేతలకు తెరపడనుంది.

గత సంవత్సరం మార్చి 15న సెర్ప్ఉద్యోగులకు పేస్కేల్ వర్తింప చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు, ఇదిలా ఉండగా గత 2018 ఎన్నికల సందర్భంగా సెర్ప్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని మేనిఫెస్టోలో చేర్చడంతో పాటు తదనంతరం ఉపయసభల సమావేశంలో గవర్నర్ ప్రసంగంలో కూడా చేర్చిన సంగతి కూడా తెలిసిందే.

ఈ సందర్భంగా రేపు రాష్ట్ర మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు హరీష్ రావు కేటీఆర్ లను కలిసి తమ ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలియచేయనున్నట్టు రాష్ట్ర జేఏసీ ఈ ప్రకటనలో వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here