Telangana Budget 2023: తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ లో నిరుద్యోగులకు షాకిచ్చింది. నిరుద్యోగ భృతిపై ఎలాంటి కేటాయింపులు చేయలేదు. 2019 ఎన్నికల సమయంలో రూ.3 వేల నిరుద్యోగభృతి ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు ఈ హామీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇటీవల చత్తీస్ గఢ్ ప్రభుత్వం నిరుద్యోగులకు అలవెన్స్ ఇస్తామని ఆ రాష్ట్ర సీఎం ప్రకటన చేశారు. దీంతో సీఎం కేసీఆర్ సైతం ఈ అంశంలో ఏదో ఓ నిర్ణయం తీసుకుంటారనే అభిప్రాయాలు వినిపించాయి. కానీ హరీష్ రావు ప్రవేశపెట్టి బడ్జెట్ లో నిరుద్యోగ భృతీపై ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో నిరుద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అలాగే గిరిజన బంధు హామీ పై కూడా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోడంతో అసంతృప్త జ్వాలలు వినిపిస్తున్నాయి.