Flash: హైదరాబాద్ లో దారుణం..మైనర్ బాలికపై వరుసకు సోదరుడైన వ్యక్తి అత్యాచారం

0
86

మహిళలపై, చిన్నారులపై దుండగుల అఘాయిత్యాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు, కఠిన చర్యలు తీసుకువస్తున్నా ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు మాత్రం అరికట్టలేకపోతున్నారు పోలీసులు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకోగా..తాజాగా హైదరాబాద్‌లో సోదరుడి వరుస అయినా యువకుడు అత్యాచారం చేశాడు.

బాచుపల్లి పోలీస్​స్టేషన్​ పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. గత మూడు రోజుల క్రితం ఈ దారుణానికి ఒడిగట్టగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అన్యం పుణ్యం తెలియని ఓ బాలికపై వరసకు సోదరుడయ్యే యువకుడే ఈ దారుణానికి పాల్పడి ఘటన స్థలం నుండి పరాయ్యాడు. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలియడంతో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు. అనంతరం పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.