Home క్రైమ్ Breaking News ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్..విశాఖలో బెట్టింగ్ గుట్టురట్టు

Breaking News ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్..విశాఖలో బెట్టింగ్ గుట్టురట్టు

India-Pakistan match..Betting conspiracy in Visakhapatnam

0
175

విశాఖలో ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ ప్రభావంతో జోరుగా బెట్టింగ్ సాగుతుంది. మాధవధారలో ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ ను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఇందులో ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ప్రభాకర్ అనే వ్యక్తిని ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రభాకర్ దగ్గర నుంచి ఒక ల్యాప్ టాప్, 2 మొబైల్ ఫోన్లు, రెండు చెక్ బుక్ లు, 2 ఏటీఎం కార్డులు, 88 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ వెనుక నగరంలో మరికొంతమంది ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు ప్రభాకర్ ఇచ్చిన సమాచారం మేరకు మిగిలిన బుకిలను పట్టుకొని పనిలో ప్రత్యేక పోలీసు బృందాలు ఉన్నాయి.