అడ్డదారులు తొక్కిన ఇన్ స్పెక్టర్..సస్పెండ్ చేసిన సీపీ

Inspector trampled on the cross .. Suspended CP

0
95

తెలంగాణ: ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసులలో కొత్త మంది అవినీతి తిమింగలాలుగా మారుతున్నారు. అక్రమంగా డబ్బు సంపాదించటానికి అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా ఓ భూ వివాదంలో అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇన్ స్పెక్టర్ సస్పెండ్ అయ్యారు.

సైబరాబాద్ పరిధిలోని నార్సింగి ఇన్ స్పెక్టర్ గంగాధర్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే గంగాధర్ గత కొన్ని రోజులు భూ వివాదాలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలోనే గంగాధర్ ను సస్పెండ్ చేశారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర. గంగాధర్ తో పాటు నార్సింగి ఎస్ఐ లక్ష్మణ్ ను సస్పెన్షన్ చేశారు.