Breaking News: హైదరాబాద్ లో ఐపీఎల్ బెట్టింగ్ కలకలం

0
81

హైదరాబాద్ లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టయింది. ఈ సందర్బంగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీ మాట్లాడుతూ..పక్కా సమాచారంతో మియాపూర్, బాచుపల్లి, గచ్చిబౌలితో పాటు మరికొన్ని చోట్ల దాడులు నిర్వహించాం. ఈ దాడిలో 23 మంది బుకీలను అరెస్ట్ చేయడంతో పాటు రూ.93 లక్షలు సీజ్ చేశాం. మొబైల్ యాప్ తో ఈ ముఠా బెట్టింగ్ కు పాల్పడుతుందని గుర్తించాం.

విజయవాడకు చెందిన మహా అనే వ్యక్తిని మెయిన్ బుకీగా ఉన్నాడు. ఇతని కింద మరో ముగ్గురు బుకీలు పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ యొక్క పిల్లల ఫోన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీపీ తెలిపారు. ఇలాంటి బెట్టింగ్ లకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవంటూ సీపీ హెచ్చరించారు.