టివి 5 అధినేత బిఆర్ నాయుడు గుట్టు రట్టు చేసిన హౌసింగ్ సొసైటీ సెక్రటరీ

0
133

జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ వ్యవహారాలు రాజకీయాలను పులుముకుంటున్నాయి. ఈ సొసైటీలో జరుగుతున్న అక్రమాలపై ఒకరినొకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. తాజాగా టివి 5 అధినేత బిఆర్ నాయుడు గురించి హౌసింగ్ సొసైటీ సెక్రటరీ మురళీ ముఖుంద్ ఒక ప్రకటన జారీ చేశారు. ఆయన జారీ చేసిన ప్రకటన యదాతదంగా దిగువన ప్రచురిస్తున్నాం.

ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో జరుగుతున్న చెడు పరిస్థితిని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను.
కొత్త క‌మిటీగా ఎన్నికైన స‌భ్యులంద‌రూ ప్రెసిడెంట్ ర‌వీంద్ర నాథ్ మ‌రియు సొసైటీకి ఏ సంబంధం లేని అత‌ని తండ్రి బి.ఆర్ నాయుడు ద్వారా నిర్ణ‌యించ‌బ‌డ‌తారు. సొసైటీకి సంబంధించిన మీటింగుల‌న్నీ వారి టీవీ5 ఆఫీస్ లోనే జ‌రుగుతాయి. వారు టీవీ5 లో చ‌ర్చించుకున్న త‌ర్వాత తీసుకున్న నిర్ణ‌యాలను మిగిలిన క‌మిటీ స‌భ్యుల‌పై రుద్దుతారు.

ఎ) ర‌వీంద్రనాథ్, త‌న తండ్రి బి.ఆర్ నాయుడు ఇద్ద‌రూ క‌లిసి సొసైటీ బై-లాస్ కు వ్యతిరేకంగా ఛైర్మ‌న్ ప‌ద‌విని క్రియేట్ చేసి, ఆ ఛైర్మ‌న్ గా కుసుమ్ కుమార్ ను నియ‌మించారు. ఆ కుసుమ్ కుమారే క‌మిటీ స‌భ్యుల‌కు ఏం చేయాలి ఎలా చేయాలి అనేది రూల్స్ పెడ‌తాడు. (దానికి సంబంధించిన మినిట్స్ కాపీ, ఫోటోలు, వీడియోలు జ‌త చేయ‌బ‌డింది) అస‌లు ఇలాంటి పోస్ట్ లు క్రియేట్ చేయొచ్చా? అదెలా చెల్లుబాట‌వుతుందో కూడా నేను తెలుసుకోవాల‌నుకుంటున్నా.

బి) వాళ్ల ఎజెండా పాత క‌మిటీ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చ‌డం మాత్ర‌మే. దాని కోసం పాత ఫైల్స్ ను మాయం చేసి, ఆ నింద‌ను నా పై పెట్టాల‌నుకున్నారు. వాళ్లు ఫైళ్ల‌ను మాయం చేయాల‌ని చూస్తున్నార‌ని గ‌మ‌నించే నేను ఆ ఫైళ్ల‌ను రికార్డ్స్ రూమ్ లో పెట్టి, లాక్ చేసి ఆ తాళాల‌ను నా అదుపులో ఉంచుకున్నా.

మొన్న 11.08.21న జ‌రిగిన మీటింగ్ లో.. ఛైర్మ‌న్ కుసుమ్ కుమార్, ప్రెసిడెంట్ రవీంద్ర‌నాథ్ బ‌లవంతంగా నా నుంచి తాళాల‌ను తీయ‌డానికి ట్రై చేశారు. నేను తిర‌స్కరించ‌డంతో వాళ్లు న‌న్ను బ‌ల‌వంతపెట్ట‌డం, బెదిరించడం మొద‌లుపెట్టారు. వాళ్లు ఆ తాళాల‌ను తీసుకోవ‌డానికి ఎంత‌కైనా తెగిస్తార‌ని నేను అక్క‌డి నుంచి వెంట‌నే వెళ్లిపోయాను.

వ్య‌క్తిగ‌త ఎజెండాతో నేను వాళ్ల‌కు తాళాలు ఇచ్చిన‌ట్లయితే, వాళ్లు ఆ ఫైల్స్ ను ట్యాంప‌రింగ్ చేసి, ఆ నింద‌ను నాపై మోపేవారు.

ఆ ఫైళ్ల క‌స్ట‌డీకి, ఒక‌వేళ ఏవైనా ఫైళ్లు మిస్ అయితే దానికి ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తారో నేను తెలుసుకోవాల‌నుకుంటున్నాను. బై-లాస్, చ‌ట్టం ప్ర‌కారం సెక్ర‌ట‌రీ నుంచి తాళాల‌ను బ‌లవంతంగా లాక్కునే అధికారం ఎవ‌రికుంది?

సి) అడ్మినిస్ట్రేటివ్ వ‌ర్క్ లో ప్రెసిడెంట్ అస్త‌మానం క‌లుగచేసుకుని, త‌న‌కు కావాల‌సిన స‌భ్యులను సెలెక్ట్ చేసుకుని వారి కోస‌మే నేను ప‌నిచేయాల‌న్నారు. నేను రూల్స్ కు వ్య‌తిరేకంగా ఏదీ చేయ‌ట్లేద‌ని.. నా సెక్రట‌రీ ప‌నిని చేయ‌డానికి త‌ను ట్రెజ‌ర‌ర్ ను ఎంచుకున్నాడు. వారిద్ద‌రూ క‌లిసి చాలా చేశారు.(ప్లాట్ నం.254-3 లో భూమి అమ్మ‌కం). ఇటీవ‌లే పేప‌ర్ లో వ‌చ్చిన‌ట్లు వాళ్లు సొసైటీలోని కొంత ల్యాండ్ ను క‌నీస రూల్స్ ఫాలో అవ‌కుండా ఫైల్ ను ప్రాసెస్ చేసి ల్యాండ్ ను విక్ర‌యించ‌డానికి ట్రై చేశారు. నేను వారికి అడ్డు చెప్పేస‌రికి, న‌న్ను ప‌క్క‌న‌పెట్టి, రిజిస్ట్రేష‌న్ పూర్తి చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. ఆఖ‌రికి మా జాయింట్ సెక్ర‌ట‌రీ కూడా త‌న అభ్యంత‌రాల‌ను లేఖ రూపంలో ఇచ్చారు (కాపీ జ‌త‌చేయ‌బ‌డింది). టైమ్ కు జీహెచ్ఎంసీ, పోలీసులు యాక్ష‌న్ తీసుకోవ‌డం వ‌ల్ల‌, రిజిస్ట్రేషన్ నిలిపివేయ‌బ‌డింది.

జీహెచ్ఎంసీ మరియు పోల‌సుల చ‌ర్య‌ల విష‌యంలో వాళ్ల‌కు నేను స‌హ‌క‌రించ‌నందుకు నా మీద నింద వేసి కక్ష తీర్చుకోవాల‌ని ప్రెసిడెంట్, కోశాధికారి నాపై ప‌గ తీర్చుకోవాల‌నుకున్నారు.

TV5 ఆఫీస్ సిబ్బందితో మా సొసైటీ SMS కంట్రోల్ పై నేను మరియు జాయింట్ సెక్రటరీ అభ్యంతరం వ్యక్తం చేశాము. సెక్ర‌ట‌రీ, మేనేజింగ్ క‌మిటీ ప‌ర్మిష‌న్ లేకుండానే వాళ్లు మెంబ‌ర్స్ కు మెసేజ్ కు పంపారు. మేం ప‌ట్టుబ‌ట్టాం కాబ‌ట్టి మ‌మ్మ‌ల్ని నోరు మూసుకోమ‌ని చెప్పారు. మేసేజ్ కంట్రోల్ విష‌యంలో రూల్స్ ని కొంచెం క్లారిటీ ఇవ్వండి.

ఇ) తాను చేసే ప‌నుల‌కు ఎవ‌రైతే త‌ల ఊపుతారో అలాంటి క‌మిటీ  స‌భ్యుల‌నే ప్రెసిడెంట్ ఎంక‌రేజ్ చేస్తాడు. త‌మ మెంబ‌ర్‌షిప్, ప్లాట్ల‌లో వాళ్ల‌కు కొన్ని స‌మ‌స్య‌లున్నాయి. అందుకే రికార్డుల‌ను తారుమారు చేయాల‌ని చూశారు.

జి. శ్రీనివాస్, క‌మిటీ స‌భ్యుడుః అత‌ని తండ్రి జి. న‌ర‌సింహారావు గ‌తంలో సెక్ర‌ట‌రీగా ఉన్న‌ప్పుడు, త‌న కుటుంబ స‌భ్యుల పేర్ల‌తో చ‌ట్ట‌విరుద్ధంగా ఎన్నో ప్లాట్లు ఆక్ర‌మించుకున్నారు. వాళ్ల‌లో త‌న చిన్న కొడుకు ఆనంద్ కు ప్లాట్ కేటాయించిన‌ప్పుడు అత‌ను మైన‌ర్.

సునీలా రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ః ఆమెకు సొసైటీలో త‌న కుటుంబ స‌భ్యుల పేర్ల మీద ఎన్నో ప్లాట్లున్నాయి. ఫైళ్ల‌ను ట్యాంపరింగ్ చేసి ఆ ప్లాట్ల‌కు సంబంధించిన ఫైళ్ల‌న్నీ త‌న‌కు హ్యాండోవ‌ర్ చేయాల‌నుకుంటుంది.

మిస్టర్ కుసుమ్ కుమార్, మేనేజింగ్ కమిటీ సభ్యుడు, తనను తాను గౌరవ సభ్యుడిగా పేర్కొన్నాడు: అత‌ను పొలిటిక‌ల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వ‌చ్చి, రియ‌ల్ ఎస్టేట్ బ్రోక‌ర్ గా చెప్పుకుంటున్నాడు.  త‌న రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఫైల్స్ ను ట్యాంప‌రింగ్ చేయ‌డానికి ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నాడు.

ఎఫ్) మా క‌మిటీ స‌భ్యుల్లో ఒక‌రైన నాగేంద్ర ప్ర‌సాద్ త‌న ప్లాట్ ను ——- సం.లో —— కు అమ్మారు. అమ్మిన డీడీ నం. ——, కొన‌గూలు దారు శ్రీమ‌తి….. మెంబ‌ర్‌షిప్ ట్రాన్స్‌ఫ‌ర్ కోసం అప్లై చేసి దానికి అయ్యే ఫీజులు కూడా క‌ట్టారు. మొన్న మీటింగ్ —— రోజున పెట్టిన‌ప్పుడు నేను ట్రాన్స్‌ఫ‌ర్ ఫైల్ ను అక్క‌డే పెడితే, నాగేంద్ర ప్ర‌సాద్ త‌న సొసైటీ స‌భ్య‌త్వాన్ని, క్ల‌బ్ స‌భ్య‌త్వాన్ని కోల్పోతారు కాబ‌ట్టి.. న‌న్ను ప్లాట్ ట్రాన్స్‌ఫ‌ర్ విష‌యంలో జోక్యం చేసుకోవ‌ద్ద‌ని బ‌ల‌వంతం చేశారు. నేను రూల్స్ ను ఫాలో అవుతూ, వాళ్లు చేసే అక్ర‌మాల‌కు అభ్యంతరం చెప్తున్నానని ప్రెసిడెంట్ మ‌రియు ఆయ‌న మ‌ద్దతుదారులు నాపై శ‌త్రుత్వాన్ని పెంచుకున్నారు.

అస‌లు నాగేంద్ర ప్ర‌సాద్ త‌న ప్లాట్ ను ఎప్పుడు అమ్మారో ద‌య‌చేసి క్లారిటీ ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను

జి) సొసైటీ క‌మ్యూనిటీ సెంట‌ర్ కోసం నాలుగున్న‌ర ఎక‌రాలలో ఒక భ‌వ‌నాన్ని నిర్మించ‌గా ఆ లీజుదారితో వివాదం ఉన్న విష‌యం సొసైటీ ప్రెసిడెంట్ ద‌గ్గ‌రే ఉంది. దీని గురించి ప్రెసిడెంట్ మ‌రియు అత‌ని తండ్రి బి.ఆర్ నాయుడు గ‌త 4 నెల‌లుగా వారితో మీటింగ్స్ జ‌రిపారు కానీ ఈ విష‌యంలో వారు సెక్ర‌ట‌రీ ని కలిసి చ‌ర్చించ‌డానికి మాత్రం ఎన్న‌డూ అనుమ‌తించలేదు. ఆ లీజుదారుకి, ప్రెసిడెంట్ కు బెంగుళూరులోని ఒక టీవీ ఛానెల్ లో వ్యాపార లావాదేవీలు ఉండ‌టంతోనే వారు ఇత‌రులను చీక‌టిలో ఉంచ‌డానికి ర‌హ‌స్య ఒప్పందాన్ని క‌దుర్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని తెలుస్తుంది.

మా సొసైటీ బిజినెస్ విష‌యంలో జోక్యం చేసుకోవ‌డంలో రాజ్యాంగేత‌ర అధికారుల‌ను నియంత్రించ‌డంలో నేను మీ గైడెన్స్ ను కోరుతున్నాను.

నేను పైన చెప్పిన వాట‌న్నింటినీ దృష్టిలో పెట్టుకుని, సొసైటీలో వ్య‌వ‌హారాల‌ను నియంత్రించాల‌నీ, ఫైళ్ల‌ను సేఫ్ గా ఉంచి, సొసైటీ విలువైన ఆస్తులకు న‌ష్టం జ‌ర‌గకుండా ఆప‌మ‌ని మిమ్మ‌ల్ని కోరుతున్నాను.