ఆఫ్ఘనిస్థాన్ లో ప్రజల కష్టాలు చూడండి – ఎంత మంది జనం విమానాల కోసం చూస్తున్నారో

0
44

ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ ప్రజలు ఏం చేయాలో తెలియక డైలమాలో ఉన్నారు. ఎక్కడ ఆశ్రయం దొరికితే అక్కడకు వెళ్లిపోవడానికి చూస్తున్నారు. ఆయా దేశాలు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో వారి విమానాలు ఎక్కేందుకు సిద్దపడుతున్నారు. ఏ విమానం దొరికితే ఆ విమానం ఎక్కేస్తున్నారు.

దీంతో కాబూల్ విమానాశ్రయం మొత్తం గుంపులుగా వస్తున్న జనాలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా జనాలు కనిపిస్తున్నారు. దీంతో అక్కడ సిబ్బందికి వీరిని నిలువరించడం కష్టం అవుతోంది. కాబూల్ ఎయిర్ పోర్ట్ లోని టార్మాక్ వద్దకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో గస్తీ కాస్తున్న సైన్యం గాల్లోకి కాల్పులు జరిపింది.

ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేసిన తర్వాత తన కుటుంబంతో కలిసి తజికిస్థాన్ లో ఆశ్రయం పొందుతున్నారు.
ఇక్కడ ఈ వీడియో చూస్తే ఎంత మంది జనం ఇలా పెద్ద ఎత్తున విమానాశ్రయానికి వస్తున్నారో తెలుస్తుంది.