Breaking news: కాకతీయ యూనివర్సిటీ విద్యార్థిని పై దారుణం

0
84

హనుమకొండలో అజహర్ అనే యువకుడు ఘోరమైన దారుణానికి ఒడిగట్టాడు. కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ చదువుతున్న అనూష అనే యువతిని అజహర్ అనే యువకుడు గత కొంత కాలంగా ప్రేమించమని వేధించాడు. దానికి ఆ అమ్మాయి అంగీకరించకపోవడంతో కత్తితో దాడి చేసాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అనూషని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ అమ్మాయి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు.