సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ రిలీజ్ కు డేట్,టైం ఫిక్స్..

0
40

స్టార్‌ డైరెక్టర్‌ పరుశురాం దర్శకత్వం లో టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్‌ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమా “సర్కారు వారి పాట”. మహేష్‌ బాబు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది. పొలిటికల్ అండ్ మాస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇక ఈ సినిమాకు నవీన్ ఎర్నేని, వైరవిశంకర్ మరియు గోపి ఆచంట నిర్మాతలుగా బాధ్యతలు స్వీకరించి తెరెకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి కళావతి సాంగ్ ను రిలీజ్ చేసి అభిమానులను ఈలలు వేసేలా చేసింది. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

అభిమానులందరూ ఎదురుచూసినట్టుగానే  టైటిల్ సాంగ్ ను చిత్రబృందం రేపు విడుదల చేసి ప్రేక్షకులను ఆనందపరచబోతుంది. రేపు ఉదయం 11 గంటల 7 నిమిషాల కు ఈ టైటిల్ సాంగ్ ను విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ మేరకు అధికారిక పోస్టర్ కూడా విడుదల చేసింది.